Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
దేవుడై మానాన్న దివ్విటీ పట్టెను
దేదీప్య మానంగ దిశలయందు
అభివృద్ధి కాంక్షించు ఆతడే మానాన్న
అడుగులు నేర్పెను అతడి చేయి
అలుక పూనునపుడు తొలకరి జల్లుగా
చిరునవ్వు చిందించు చేర నిలిచి
కన్నీరు కార్చిన కరిగి పోవును నాన్న
కరకుదనము తోడ కాంచుమమ్ము!
ఆ.వె
చిన్న నాటి నుండి వెన్నుదన్నుగ నాన్న
అన్న వోలె నన్ను ఆదరించి
కష్ట జీవి నాన్న నష్టాలయూబిలో
నలిగిపోయినాడు వెలుగు పంచి!
శశికళ 🙏🏾