Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
నిండైన వృక్షమై నీడనిచ్చును నాన్న
తోడు నీడగ యుండి వీడడెపుడు
అరుణబింబముగాను అలరారు మానాన్న
అమ్మ ముఖమునందు ఆతడెపుడు
పూజింతు మేమంత పొదరింట నాన్నను
రంజింప జేసేటి రాజునాన్న
ఆత్మ శక్తిని పెంచు అతడే మానాన్న
తనువును పంచిన త్యాగధనుడు
ఆ. వె
రథము నడుపు నాన్న రహదారి పైనను
జగతి జూపుమాకు జాగులేక
హితవు జెప్పు నట్టి మితభాషి మానాన్న
వెలుగు పంచునట్టి వేగుచుక్క !
శశికళ