Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ. బి
సీ. ప
మంచితనము తోడ మానవత్వము జూపి
విద్యలన్ని నేర్పి విలువ పెంచి
ధర్మాన్ని మర్మాన్ని దర్శింప జేసెను
గమ్యాన్ని జూపించు ఘనుడు నాన్న
మెత్తనీ మనసుతో మేలు జేయును నాన్న
సమత మమత జూపు సహన శీలి
స్వార్థాన్ని తగ్గించి సంస్కారమును నేర్పి
చతుర కలిగి నన్ను సాకినాడు!
ఆ. వె
అష్ట కష్టములను ఆర్తితో భరియించి
జగతి కీర్తి పొందె జాగు లేక
ఘనముగాను పెంచి గారాబమును జేసి
గుణము కలిగు నాన్న గురుతు నాకు!