Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ..పెద్దాయనా..
ఒంటరిగా వణుకుతూ...
గునుకుంటూ..ఎక్కడికి..??
తడబడుతున్న.. అడుగులతో..!!
తల్లడిల్లుతున్న శరీరంతో..!!
మసక బారిన చూపులతో..!!
ఎక్కడికి ఈ నడక...??
తూలి పోతూన్న అడుగులతో..!!
తేలిపోతున్నా మనసుతో!!..
మతిమరుపు దారుల్లో
ఎక్కడికని వెల్లగలరు...??
తెలియని గమ్యానికి
తెగువతో సాగుతున్నావు..!!
లోలోపల.. ఏదో బాధ నింపుకొని..!!
బతుకు మోతతో.. బయలుదేరినట్లు
అన్ని సమస్యలు లోపలే బంధించుకొని..!!
లొలొపలే..కుమిలి పోతున్నావు...
చెప్పు..పెద్దాయన..నీ బాధ ఏమిటి..!!
చేతికొచ్చిన చెట్టంత
కొడుకుల్ని పెట్టుకొని
అయ్యే!! ఓ దేవుడా...అంటూ...
నీ కష్టాని ఎవరో దోసుకున్నట్లు..!!
నీ శ్రమను ఎవరో లాకున్నట్లు!!
నిరాశ నిస్పృహతో ..సాగుతున్నావు..
పెద్దపెద్ద ఉద్యోగాలలో ..!!
ఉన్న కొడుకులు
నిన్ను ఏమైనా మోసం చేశారా??..
నీదారి వృద్దాశ్రమానికి ఉన్నట్లుంది..!!
ఏంటి నీ పరిస్థితి !!
తెలియని వింతస్థితి!!
నీ జవసత్వాలన్ని.. దారబోసి
గొప్పవారిని చేసి..
పెద్దపెద్ద..జాబులు వచ్చాక
నీవు వారికి నచ్చక..
నీతో అవసరం తీరక..
నిన్ను వదిలించుకోవడానికి
ఆ వృద్దాశ్రమ దారి చూపించారు..
నడుస్తున్న చరిత్రలో ..!!
ఇవి వాస్తవ దృశ్యాలు..ఓ పెద్దాయన...
నీవు చెప్పకున్న అర్థమవుతుంది..!!
అయినా కొడుకులమీద ప్రేమతగ్గలేదు..!!
తండ్రి మనసు ఏంటో ..
అర్తం చేసుకోని కొడుకులు..
ఈ సమాజంలో ఎందరెందరో..!!
అందరున్న అనాదగా..!!
నిస్సత్త్వతో యాతనపడుతూ..
లోకసంచారై తిరుగుచున్నారు
కడుపునింపే వారులేక..
కన్నీళ్ళు తూడ్చే వారు రాక
ఈసడింపులతో వెక్కిరింతలతో..
గుండెకు గాయాలు చేస్తు..
బయటికి తరీమేస్తున్నారు..!!
ఎంత యేదిగి పోయినా..
ఎంత పెద్ద ఉద్యోగమున్నా..
పెద్దపెద్ద అంతస్తులున్న..
అమ్మ నాన్న శ్రమను కష్టాని
ఒంపుకొని బయటికి వచ్చినొల్లే..!!
వాళ్ల పొత్తిళ్లలోంచి ఈ పుడమి పైకి
వచ్చినోళ్ళు..అదిమరిచిపోయి
ఎందరో కొడుకులు తల్లిదండ్రులను
అనాదలుగా..చేస్తున్నారు..!!
కనిపెంచిన తల్లిదండ్రులను
కన్నీళ్లు పెట్టిస్తే..వృద్ధిలోకి రారు
అభివృద్ధి చెందరు..గుర్తుంచుకోండి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
20-9-2020