Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరిపె రాజ్ కుమార్
8125144729
దృశ్యాదృశ్య బహుముఖీన దుఃఖ విచలిత కల్లోలం!
శైశవ దశారంభిత శిక్షణ ప్రశిక్షణల సంక్షోభం!
మృగశిర కార్తె ముందస్తు సందడుల మూగరోదన!
మృత్యువు తరుముతున్న సవ్వడి!కాలం తరుగుతున్న అలజడి!!
ఆన్ లైన్ అభ్యసన నిర్దేశ అట్టహాస కలకలం!
మైదాన ప్రాంతాల పరిస్థితి కొంత నయం!
ఆదివాసీ ఆశ్రమాలు సకలం కలవరం!
కొండాకోనల్లో ఆచ్ఛాదిత అక్షర తిమిరం!
నిరుపేద గిరిబాలలకు అందని నైవేద్యం!
పలు వ్యాపకాల కాలహనన ప్రహసనం!
అర్థం చేసుకొనే తల్లిదండ్రులున్నా!
ఆదుకోలేని ఆర్థిక దైన్యం!!
అందుకోలేని అధికార ఆపన్నహస్తం!
తెరవాణి నెరజాణ అందనంత దూరం!!
విద్యుత్ ప్రసారం నిరంతర అంతరాయం!
మంచెలెక్కినా అందని తరంగ దైర్ఘ్యం!
చిటారు కొమ్మన పౌనఃపుణ్య పొట్లం!
నాజూకు చరవాణి నడక బహు సుతారం!!
బడిలో బుడతలు సర్వ సమానోపనిషత్తులు!
ఏకరూపదుస్తులు వస్తువులు ఆటస్థలం ఉపపత్తులు!!
గుణాలు! సంగణకాలు! సాముదాయక ప్రాంగణ పర్యవేక్షణలు!!
క్రమశిక్షణ కొలమాపనాలు! అభ్యాసకుల అంతరంగ లేపనాలు!!
అరకొరవసతులతో! అభ్యసనం అర్థాంతరం కారాదు!
సాంకేతిక సౌలభ్యం అర్థవంత తీరాలు చేరాలి!
స్ఫూర్తి ప్రదాతలు మార్గనివేశనం నిర్దేశించి తీరాలి!
బడుగుబడుల్లో పాఠ్యాంశాలు ప్రామాణికమై భాసిల్లాలి!
గహనాంతర కుహరాల్లో విద్యా జ్యోతులు విరాజిల్లితే?
ప్రగతి చోదక శక్తులు పునరుత్తేజితమవుతాయి!
పౌరుల ప్రాథమ్యాలు పరిపరివిధాల పరిపుష్టమౌతాయి!
ప్రజాస్వామ్య ప్రతిఫలాలు ప్రతివ్యక్తిని చేరుతాయి!!