Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రంగనాధ్ దేశిరాజు
9703643447
గ్రాంధికం
సగటు మనిషి కి
అందని
అరటిపండయినవేళ
పండితుల
పాండిత్య ప్రకర్ష
పామరులకు
తమభాషే
పరభాషా సదృశమై
తన ప్రయోజనాన్ని
కోల్పోయిన
స్థితిలో
గ్రాంథిక, వ్యాకరణ
శృంఖలాలో
బందీయైన
తెలుగు భాషామతల్లి
విమోచన కై
నవయుగ
వైతాళికుడ వై
ఓ ఉజ్వల
భాషోద్యమానికి
అంకురార్పణ చేసిన
గురజాడా!
సనాతన కుసంస్కృతి కి
అర్పణమై పోతున్న
పుత్తడి బొమ్మలు,
పూర్ణమ్మల
నవ జీవనోదయానికి
నాంది వాక్యం పలికిన
స్త్రీ జనోధ్ధారకా
అప్పరాయా
మా జాడ తెలియజేసిన
గురజాడా!
నీ కిదే
మా
ప్రణామ సహస్రాలు