Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సింగీతం సంతోష్ కుమార్, కామారెడ్డి
7989929908
వెంకట రామదాసు కౌసల్యమ్మ దంపతుల పుత్రుడు!
ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడు
మహాకవి గురజాడ!!
ఆయన చేసిన రచనలు నేటి ప్రజల మన్ననలను పొందుతూ!
సంఘసంస్కర్త,సాహితీవేత్త హేతువాది!!
అభ్యుదయవాది మహాకవి!
తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి !!
ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీకారులలో ఒకరు! ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసి!!
కన్యాశుల్కం నాటకానికి సాహితీలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి!
తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు !!
ఆధునిక,భావాలు చిగురు తొడుగుతున్న తొలిరోజులో!
నవ్య కవితాకాశంలో అందంగా మెరిసిన మరో సూర్యుడు గురజాడ!!
సంఘంలో దురాచారాలను ధైర్యంగా ఎదిరించిన ధీరుడు!
సాహసి గురజాడ,
మానవతా మూర్తి!!
సంఘ సంస్కర్త గురజాడ తన జననం సాహితీలోకానికి నవోదయం!
సమాజంలో
కథ,చలన,చిత్ర రంగ వ్యవహారిక భాషోద్యమ వెలుగు!!
సాహిత్యం సామాన్యులకు అర్థమయ్యేల
గురజాడ భాషకు వన్నెతెచ్చిన నవయుగ వైతాళికుడు!
సమాచారాన్ని ఎండగట్టి తెలుగు భాషకు వన్నెతెచ్చిన నవ కిరణం!!
ఆయన భాషా సేవ చిరస్మరణీయం!
గురజాడ సాహిత్యనికి కన్యాశుల్కం నాటకం
కొండంత అండ!!