Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మైలవరపు చారులత
హైదరాబాద్.
వెంకటరామారావు, కౌసల్యమ్మ ల ముద్దుబిడ్డ
రాయవరము గురజాడ పురిటిగడ్డ
బాల్యమంతా కష్టాలమయం
స్వయంకృషి తో వృద్ధి నీ జీవనం
ప్రాణస్నేహితుడు గిడుగు తో అడుగేసే
దురాచారాలెన్నో కలిసి కడిగేసే
అలసట లేని పోరాటం
భాషోద్యమ ఆరాటం
పూర్ణమ్మ,కన్యకల బాధలు చూశావు
ఎందరో అబలల కన్నీరు తుడిచావు
నీ కలంనుండి జాలువారిన రచనలు
దురాచారాలను దునిమే తుపాకులు
ఓ గురజాడ అందుకో శతకోటి వందనాలు