Authorization
Mon Jan 19, 2015 06:51 pm
✍️ కడారి సాయి సురేష్
చరవాణి : 8639925732
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
స్వప్నంలో విహరించి
అస్తిత్వాన్ని మరచింది
నా ఛాయ....
అభివృద్ధి అని
సంస్కృతిని మరచింది
నా దేశం....
ఫ్యాషన్ అని
చీరకట్టును మరచింది
నా సోదరి ....
డబ్బు మైకంలో
బంధాలను మరచారు
నా అనేవారు....
ఇలా సమస్తమూ మరచి
అభివృద్ధి అంటున్నారు
ఇది ఎక్కడి అభివృద్ధి....?
ప్రపంచ నలుమూలలా వ్యాపించిన
సంస్కృతి మనది....
వేద అక్షరాల జన్మభూమి
నేర్పించటం కానీ
నేర్చుకోవడం ఎందుకు
నేర్చుక పోయిన దాంట్లో
కొసరు నేర్చుకుంటున్నావా....!
అద్దంలో నీ బింబం
పచ్చతాపం పడే రోజు కోసమా
ఎదురు చూసేది...
ఒక్కసారి ఆలోచించు
నీ పయనం ఎటు ఎటువైపోనాని
మార్గనిర్దేశనకు మనస్సాక్షి వారధి మిత్రమా!