Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కొండా రవీందర్
9848408612.
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులని
చాటిన మహనీయుడు
గురజాడ అప్పారావు
అణువణువునా అక్షరాలతో
దేశభక్తిని రంగరించుకొని
అక్షరాలకి అభిషేకం కావించి
దేశమును ప్రేమించుమన్న
తెలుగు సాహితి కిరీటి
కన్యాశుల్కాన్ని సమాజం పై
ఎక్కుపెట్టి సంఘసంస్కరణకు
నడుము బిగించిన
కందుకూరి వారసుడు
గ్రాంధికభాష నుండి
వాడుక భాష రచనల కు
గిడుగు పంతులుతో
భాషోద్యమానికి నాంది
పలికిన వైతాళికుడు
కులమతాల సంకుచ్ఛితా భావాలపై
అంటరానితనం కరుకుతనం పై
అవిశ్రాంత పోరాటం సల్పి
అవ్వరే అనిపించుకున్న
నవయుగ చక్రవర్తి జాషువా
సమాజంలో పెచ్చిమీరుతున్న
అణగారిన వర్గాలపై అహంకార
ధోరణులను ధిక్కార స్వరాలను
ఎదిరించ అక్షర బాణాలను
సంధించిన గబ్బిలం అతను
గాడితప్పిన మానవ సంబంధాలను
కడిగిపారేసి చైతన్యని
నింపిన కాందిశీకుడు..
స్మశాన వైరాగ్యం తో జీవిత
విలువలకు ప్రాణం పోసి
కొత్తలోకం లో విహరింప చేసిన
ఆధునిక సాహితి చక్రవర్తి
కాలాలు వేరైనా సమకాలికులు గా
దేశ సమాజ సంఘ సంస్కర్తలుగా
సాహితి పూలతోటలో విరిసిన
తెలుగు ముద్దు బిడ్డలు
గురజాడ జాషువాలు
నిత్య చైతన్య సారథులై
ఈనాటికి రేపటి తరాలకు
సూర్య చంద్రులు గా
ఈ పుడమిలో వెలుగులు
పంచుతున్నే ఉంటారు.