Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోడిగూటి తిరుపతి
9573929493
సాహితీ లోకపు ధ్రువ తార
సంస్కరణోద్యమాల కాగడా
తెలుగు జాతి అడుగు జాడ
గురజాడ వేంకట అప్పారావు
వందేళ్ల క్రితమే...
దేశమును ప్రేమించుమన్నా…
మంచియన్నది పెంచ్చుమన్నా అంటూ
యువతలో దేశభక్తి రగిలించిన దార్శనికుడు
వ్యవస్థీకృత మూఢ విశ్వాసాల మీద
యుద్ధం ప్రకటించిన "కలం" యోధుడు
కన్యాశుల్కం నాటకంతో…
దురాచారాల ప్రశ్నించిన ధీరోదాత్తుడు
స్త్రీ జాతి బానిస "విముక్తి" కోసం ...
అక్షర "సమరం" సాగించిన "కవన" వీరుడు
వ్యవహారిక భాషోద్యమాన్ని ...
ముందుండి నడిపించిన మహా సారధుడు
గ్రాంధిక బాషావాదుల ధిక్కరించి ...
సాహిత్యాన్ని జన ధరికి చేర్చిన విప్లవుడు
తెలుగు భాషా వికాసానికి ...
అహర్నిశలు కృషి చేసిన ఆదర్శప్రాయుడు
వాస్తవిక దృక్పథ రచనలతో ...
సమాజాన్ని జాగృతం చేసిన మార్గదర్శుడు
అతడు...
నవయుగ వైతాళికుడు
అభ్యుదయ కవితా పితామహుడు
గురజాడ ...
సంస్కరణల "క్రాంతి" కాగడా
తెలుగు జాతి "వెలుగు" జాడ