Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దుబ్బాక అమర్నాథ్
6281495962
కవిత్వం అనెడి మెరుపు
కవి కలమునకు సిరి వలపు
జన జీవనానికి తెచ్చింది నవమలుపు
సంధించగలరు అక్షారబాణన్ని
ధ్వంసం చేయ గలదు అజ్ఞాన కోణాన్ని
ఊహాలోకం లో విహరించే గల క్షణమిది
తీర్చుకొగలమా కవీంద్రుని ఋణము
తూటాలు లేని రణమిది
అలవడితే వీడని గుణమిది
అక్షరమధువులతో వికసించే నిధులు
నైతికత లను పెంచెడి సుధలు
సత్ప్రవర్తన బోదించ గల విధానాలు
సౌందర్యమును వర్ణించగల కథనాలు
తెలుగు తల్లికి నా వందనం
వాణితో మాత కు సిరి చందనం
కర్కశముని కఠినత్వమును
కోమలంగా మార్చగల సాధనం
ఎగరవేదాం విజయ కేతనం
సుక్తులపట్ల ఆసక్తి కలిగించే శక్తి
భుక్తి ని వదిలి ముక్తిని ప్రభోదించే యుక్తి
భాషను భుషణంగా కలిగిన కవిత కవనము
చైతన్యపు పరిమళం గలిగిన భవిత భవనము
శబ్దగణములతో ఏర్పడిన బంధము
బంధనలను పోగొట్టే ప్రబంధము
ఇది నా కవిత ముకుందము