Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దార్‌కు కవిత, హైదరాబాద్
6281950150
ఆటవెలది:
కలియుగాన బుసలు కొడుతున్న కోవిడ్
మాయజీవి నీకు మందు లేదు
బాధపెట్ట మాకు బాధల బందివి
సర్వమెరిగే వాడ శ్రీనివాస!
ఆటవెలది:
ఎక్కడెక్కడిదని ఏపాడు రోగము
చీడ పురుగు పుట్టె చైన లోన
అన్ని దేశములకు అంటించె ఆగము
సర్వమెరీగె వాడ శ్రీనివాస!
ఆటవెలది:
భరత భూమి అన్ని బందులు చేసింది
ముందు చూపు తోని ముప్పు తప్పి
అదుపు చేసే ఘనము ఆపద అధికము
సర్వమెరిగె వాడ శ్రీనివాస!
ఆటవెలది:
దాడి చేసేనంటె దరికి రారెవ్వరు
చెంతనున్నదేమొ చేటు గడువు
చేరకుండ చూడు కోరల తీరము
సర్వమెరిగె వాడ శ్రీనివాస!
ఆటవెలది:
కన్నవారి కడుపు కోతకు కోవిడ్
కారణమయి తాను కన్నవారి
చివరి చూపు దక్కదీ వ్యాధికి గురైతె
సర్వమెరిగె వాడ శ్రీనివాస!
ఆటవెలది:
గొంతులోన కట్టె గూడేమొ కోవిడ్
ఊపిరాడనీయ ఉడుము పట్టు
శ్వాసకోశ మీద సాన పెట్టి
సర్వమెరిగె వాడ శ్రీనివాస!