Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పగిడిపాటి నర్సింహ
చిట్యాల
పసిపిల్లలపై పైశాచికత్వం
మగువలపై మానభంగం
తమ్మున్ని నరికిన అన్న
అన్నను చంపిన తమ్ముడు
మహిళ మెడలో గొలుసు చోరీ
ప్రేయసిని హతమార్చిన ప్రియుడు
ప్రియుడు చేతిలో యువతి హత్య
బాటసారిపై దుండగుల దాడి
ఇవే కదా పేపర్లో రోజు చూసే వార్తలు
సమాజంలో జరుగుతున్న ఘటనలు
మనుషులను కలవర పెట్టె నిజాలు
మనసులను ఆందోళన పరిచే అంశాలు
మానవత్వం మంట కలిసే క్షణాలు
దానవత్వాన్ని నిద్రలేపే నేరాలు
మనుషుల మద్య మాయని గాయాలు
ప్రపంచాన్ని పీడిస్తున్న రుగ్మతలు
ఇవ్వన్ని లేని రోజు ఇప్పట్లో లేదా
సుఖసంతోషాలతో ఉండే రోజు రాదా
ఐకమత్యంగా ఉండే పరిస్థితి వద్దా
ఆనందమయ జీవితమే అందరికీ ముద్దు.