Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎం డి . ఖాజామైనద్దీన్, మహబూబ్ నగర్
సంధి కాలంలో ఉదయించిన ,
తెలుగు కవితా భాస్కరుడు.
గురజాడ భావవిప్లకారుడు.
ప్రపంచ సాహిత్యక్షేత్రాన్ని
సుసంపన్నం చేసి నవాడు.
సాహితీ జీవనది సాగుతున్న
తెలుగు వైతాళికుడు.
సంఘ సంస్కరణను, సామాజిక లక్షణాలను,
చక్కదిద్దిన సంస్కర్త.
దేశమంటే మనుఘలోయ్.
గతకాలపు ఆలోచనల్లో బ్రతుకుతూ,
గతంంలోకి దిగజారి పోతుంది.
కుల వివక్ష ,మతవైషమ్యాలు,మూఢనమ్మకాలు,
స్త్రీ విద్య ,బాల్యవివాహాలు,వితంత వివాహాలు,
వేశ్వావృత్తి అన్నిటి మీద విల్లు పెట్టిన,వాడు.
మంచి అన్నది మాల అయితే - మాలడునేనగుదున్ అని,
తాత్విక సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టి,
ప్రజా జీవనసరళిని మార్చాడు.
తిరోగమనం చెందుతున్నప్పుడు,
దేశం అంధకారరుగ్మతలో - బాదపడుతున్నప్పుడు,
గురజాడ అడుగు జాడల్లో - ఒక్కొక్క గురజాడ కావాలి.
గురజాడ మానవీయతా - కుల వివక్షవ్యతి రేకుడు,
అదే గూరజాడకు నిజమైన నివాళి.