Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పింగళి భాగ్యలక్ష్మి
తెలుగు సాహిత్యంలో సువరాణక్షరాలతో లిఖించతగ్గ పేరు గురజాడ అప్పారావు. జాతీయతస్పూర్తి దేశమంతా వెల్లివిరిస్తున్న రోజుల్లో కలంపట్టిన యోధుడు. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న భారత యువతను తట్టిలేపిన కలంయోధుడు. ఈ అభ్యుదయ కవితా పితామహుడు బిరుదాంకితుడు. తెలుగు జాతికి భాషా, సాహిత్యరంగాలలో అత్యుధునిక అభ్యుదయ మార్గాన్ని చూపించిన మహాకవి. ఇంకా 'దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా...గట్టిమేలన తలపెట్టవోయి...' అంటూ యువతలో దేశభక్తిని రగిలించిన ఈ కవిశేఖర బిరుదాంకితులు విశాఖజిల్లా యలమంచిల్లి గ్రామం రాయవరం మండలంలో మేనమామగారి యింట్లో 1862, సెప్టెంబరఉ 21న వేంకటరామదాసు, కౌసల్యమ్మ దంపతులకు గొప్ప సంఘసంస్కర్తగా జన్మించారు. వీరి తమ్ముడి పేరు శ్యామలరావు. వీరు కూడ రచయిత గురజాడ వారి పూర్వికులది కూడా కృష్ణా జిల్లా. వారిది పండితుల కుటుంబం. వీరికున్న పాండిత్యంతో ముందుతరం వారికి విజయనగరం సంస్థానంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుండి గురజాడ వారి తల్లిదండ్రులకు ఉత్తరాంధ్రలో స్థరపడ్డారు.
అప్పారావుగారి తండ్రి విజయనగరం రెవెన్యూశాఖలో సూపర్వైజర్గా పనిచేశారు. అప్పారావుగారు 10వ ఏట వరకు చీపురుపల్లిలో చదువుకొనసాగించారు. తరువాత తండ్రి చనిపోవడంతో విజయనగరం వచ్చారు. ఇక్కడ కడుపేదరికంతో వారాలు చేసుకుంటూ కష్టపడి చదివి మెట్రిక్యులేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. 1884లో బి.ఎ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇదే సంవత్సరంలో ఎమ్.ఆర్. స్కూల్లో టీచర్‌గా పని చేశారు. గురజాడవారు విజయనగరంలో బి.ఎ చదువుతున్నప్పుడు వాడుక భాషా ఉద్యామ నాయకుడు గిడుగురామ్మూర్తి పంతులు ఆయనకి క్లాస్‌మెట్. కాలక్రమేణా వారిద్దరు ప్రాణస్నేహితులయ్యారు. గురజాడ 1885లో అప్పల నరసమ్మని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు. వీరు అప్పట్లో కళింగ రాజ్యంగా పేరొందిన విజయనగరంలోనే స్థిరపడ్డారు. విజయనగరం సంస్థానాధిపతి పూసపాటి గజపతిరాజుతో గురజాడవారికి మంచి సత్సంబంధాలుండేవి. 1887లో విజయనగరంలో కాంగ్రేస్పార్టీ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రసంగించారు. సాంఘిక సేవచేయడానికి విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. అలాగే 1889లో ఆనంద గజపతి ఓటింగ్ క్లబ్‌కు ఉపాధ్యక్షులుగా ఎన్నికియి తనవంతు సేవలనందించారు.
వీరి తమ్ముడు కూడ మంచి కవి కావడంతో తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. వీరు రాసిన 'సారంగధర' అనే ఆంగ్ల పద్యం కలకత్తాలో వున్న రాస్ అండ్ రాయిట్ ప్రచురణకర్త శ్రీ శంభు చంద్ర ముఖర్జి ఆ పద్యాలువిని మెచ్చుకొని తెలుగులో రచనలు చేయమని ఎంతోగొప్పగా ప్రోత్యహించారు. దాంతో అప్పారావుగారు మాతృభాషాపై ఎక్కువ దృష్టి పెట్టి అప్పటి నుండి తెలుగులో రచనలు చేయడం మొదలు పెట్టారు. 1886లో డిప్యూటి కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్క్‌గా, 1887లో అధ్యాపకునిగా విధులు నిర్వహించారు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా విధులు నిర్వహించారు. ఇలా పలురకాల ఉధ్యోగాలు చేస్తూ మరొపక్క రచన వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ అటు వృత్తిని ఇటు ప్రవృత్తికి సమన్యాయం చేశారు. సామాజిక రంగంలో సంస్కరణలు చేపట్టి తన స్నేహితులైన కందుకూరి, గిడుగువారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమ పోరాటంలో తాను భాగస్వాములయ్యారు. వీరు ముగ్గరు కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంధిక భాషా వాదులో అలసట ఎరుగకుండ పోరాటం చేశారు. ఇలా భాషా వికాసానికి అహరున్శిలు కృషి చేసి తెలుగు భాషలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.
పుస్తకాలోన్ని సాహిత్యం గ్రాంధిక భాషలోనే వుంటూ పండితులకు మాత్రమే అర్థమయ్యే తీరు ఆయనకు తీవ్రంగా కలచివేసింది. గ్రాంధిక భాషను పక్కకకు పెట్టి సామాన్యులకు సైతం అర్థమయేరీతిలో సరళమైన, అందమైన చక్కని పదాలను ఏర్చి, కూర్చి సాహిత్యాన్ని సామాన్యులందరిదరికి చేర్చారు గురజాడవారు. ఇందుకు నిదర్శనమే 'దేశమును ప్రేమించుమన్నా...గట్టిమేల్ తలపెట్టవోయి..' అనే గురజాడ రాసిన దేశభక్తి గీతం మనం పరిశీలిస్తే అందరికి అర్థమయ్యేరీతిలో ఆయన ఎంతో సరళమైన భాషను ప్రయోగించారో ఇట్టే అవగతమౌతుంది. ఈ దేశభక్తి గీతం ఇప్పటికి ప్రతి ఒక్కరి గొంతుకలో మారుమ్రోగుతు అందరి మనస్సుల్లో చెరగాని ముద్రని వేసుకుంది.
వాడుకభాషను ప్రగతిశీల భావాలతో ముందుకు తీసుకెళ్ళే విధంగా కళ్ళెదుట జరుగుతున్న దృశ్యాలు, సన్నివేశాలను అక్షర రూపాంలోకి తెచ్చారు. ఈ పరంపరలో భాగంగా తొలి తెలుగు కథ దిద్దుబాటు ఆయన కలం నుండి సరళమైన భాషలో జాలువారిన ఆణిముత్యం. ఆయన రాసిన ముత్యాల సరాలు మనవతా విలువలకు పరిహారాలు. అలాగే కరుణ రసాత్మకమైన కావ్యం 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అలాగే గురజాడవారి రచనా వ్యాసంగంతో ఆంధ్ర సాహిత్యంలో అసలైన స్త్రీ పర్వం మొదలైంది. మహిళా స్వేచ్ఛని, హక్కుని, శక్తిని వాళ్ళు గుర్తించేలా సాహిత్యాన్ని అందంగా మలచారు. స్త్రీ జాతిలో విముక్తి కలించడానికి వారిలో ధైర్యాసాహసాలు నింపడానికి కన్యాశుల్కమనే నూతన కావ్య సృష్టితో స్త్రీలకి ప్రశ్నించడం నేర్పాడు. పాశ్చాత్య నాగరికతా వ్యామోహం, బాల్యవివాహాల నిర్మూలన, వితంతు వివాహాలు, వేశ్యావ్యవస్థ నిర్ములణ, మూఢాచారాలు, అవినీతి మొదలైన అంశాలను కన్యాశుల్కంలోను, ఇతర రచనలలోను ఎంతో గొప్పగా మార్గనిర్దేశం చేశారు. ఈ కన్యాశుల్కం నాటకంలోని ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. 1892లో ఈనాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దాంతో సాహిత్యంలో వాడుక భాషా ప్రయోగానికి నాందిపలికింది. సాంఘిక ఉపయోగంతోపాటు, రసజ్ఞల ఆనందా నికి వాడుక భాషవాడ వచ్చిని నిరూపించింది. 1897లో రామస్వామి అండ్ సన్స్ మద్రాసువారు ఈ నాటికని ప్రచురించారు. అప్పారావుగారు కన్యాశుల్కం నాటకాన్ని మహారాజ్ ఆనంద గజపతిరాజుకి అంకితమిచ్చారు. 100 సంపపల తర్వాత కూడా ఈ నాటకం ఈనాటికి పాటకులను అలరిస్తూనే వుంది. ఈనాటకం కన్నడం, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీషు, తమిళం, హిందీలాంటి పలు భాషల్లో అనువదింపబడి చరిత్ర సృష్టించింది.
ఈ సంఘసంస్కర్త ఇంకా సారంగధర, పూర్ణమ్మ, నీలగిరిపాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతశతకము, సుభద్ర, లంగరెతుము, దాంచగలరు, లవణరాజుకల, కాసుల సౌధామిని మీపేరేమిటి, దిద్దుబాటు, మతమువిమతము, పుష్పాలవికలు లాంటి ఎన్నో అద్భుతమైన కావ్యాలను సాహితీ ప్రియులకందించి వాడుక భాషలోని అందచందాలను దేశం నలుమూలలా వ్యాపింపజేశారు. సాహిత్యంలో ఆయన చేసిన కృషికిగాను 1913లో మద్రాసు విశ్వవిద్యాలయం వారు ' ఫెలో' తో గౌరవించారు.
గురజాడవారు చిన్నప్పటి నుండి జీర్ణకోశ వ్యాధితో బాధపడేవారు. వయస్సు పెరుగుతున్నకొద్ది వ్యాధి తగ్గకపోగా పెరుగుతూ వచ్చింది. నీలగిరికొండలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. విశ్వవిద్యాలయ కమిటిలో సభ్యులు గానియమింపబడ్డారు. ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంత జీవితం గడపాలన్నా సాధ్యపడలేదు. ఎన్నో విషయాల్ని ఎంతో ధౌర్యంగా ఎదుర్కొని ఎదురించిన గురజాడవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకొని తిరిగి కలాన్ని ఆయుధంగా చేతబుచ్చుకొని విజృంభిస్తారని వైద్యులు ఆయనకి ధైర్యం చెప్పి ప్రోత్సహించేవారు. ఆ ధైర్యంతోనే నేను బ్రతికి బైటపడితె నన్ను వేధించిన ఈ ఆహార పదార్ధాలు అన్ని చదివి ఓ ఆహారగ్రంధం రాస్తాను డాక్టర్ అంటూ నవ్వారు. అలా నవ్వుతూనే కుటుంబ సభ్యుల్ని చూస్తూనే 1915 నవంబర్ 30న గురజాడ వారు అమరులయరు. తెలుగు భాషను ఆధునికత వైపు నడిపించిన వైతాళికుడు. వ్యక్తి స్వేచ్ఛను సాధించండి, అందువల్ల దేశం స్వతంత్రం అవుతుంది. జాతిమత, కుల బేధాలుమరచి ప్రేమను పంచండి అంటూ ఆనాడే దేశానికి దిశా నిర్దేశం చేసిన మార్గదర్శి గురజాడ అందుకే గురజాడ అడుగు జాడ వెలుగుజాడ.