Authorization
Mon Jan 19, 2015 06:51 pm
✍పులి జమున
మహబూబ్ నగర్
8500169682.
పసితనంలో పరిమళించిన దేశభక్తి
భరతమాత సేవకు అంకితమైన స్పూర్తి
ఉన్న ఊరును కన్నవారిని వదిలి
కఠిన సైనికశిక్షణలను ఇష్టంతో తట్టుకుని
నిరంతరం దేశరక్షణకు పాటుపడే సైనికులు
వెన్నుచూపని వెనుకడుగు వేయని
ధైర్య సాహసాలకు సైనికులే ప్రతీకలు
భరతమాత రక్షణ కవచమై నిలిచి
ప్రాణ త్యాగానికి సైతం వెరవని
గుండె నిబ్బరం సైనికులకే స్వంతం
ఎండావానలలో మంచుపర్వత లోయల్లో
సరిహద్దులను పహారా కాస్తూ
శత్రుమూకలను మట్టికరిపిస్తూ
కంటి మీద కునుకు లేకుండానే
భరతజాతి రక్షకులవుతారు సైనికులు
ప్రమాదపు అంచులలో పయనిస్తూ
అనునిత్యం భవబంధాలకు దూరంగా
మొక్కవోని ఆత్మస్థైర్యానికి ఆలంబనగా
బాధ్యతలను నిర్వర్తించే భరతమాత బిడ్డలు
భవ్య భారతికి స్పూర్తి ప్రదాతలు సిపాయిలు
పేగుబంధాలకు అల్లంతదూరంలో వుంటూనే
దేశ సంక్షేమానికి అహరహం పాటుపడుతూ
బంధాలను మరచి బాధ్యతలో లీనమై
అందరి ఆనందాలకు ఆలంబనగా నిలిచిన
సైనిక వీరుల త్యాగ నిరతికి వేనవేల వందనాలు