Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
గొప్ప..చదువులు చదివి
ఎంతో..పేరున్న మనిషివి..!!
సామాజిక స్ఫూర్తి కలిగి
ఎందరో.. నీ మీద నమ్మకం
పెట్టుకొని నీ బాటలో
నడుస్తున్నారు..!!
నీ ఆలోచనలో అడుగేస్తున్నారు..!!
అంత గొప్ప వ్యక్తివి..
ఎంతో ..విలువైన
వ్యక్తిత్వమున్నోడివి..!!
మరి ఇదేంటి..??మూఢనమ్మకం..
మహత్తులంటావు..!!
గమ్మత్తులంటావు..!!
తాయత్తులంటావు..!!
భక్తిలతల్తో ఆలుకుకుపోతావు..
అంకెలతో ..అదృష్ట మంటావు..
సంకేలతో.. సహసమంటావు.
ఇవి అన్నీ.. అశాస్త్రీయ ఆలోచనలు
నిజమైన.. శాస్త్రియాన్ని నెట్టేసి
వెతలు తీర్చలేని జాతకులకు దగ్గరై
జీవితలక్ష్యాలను వదిలేస్తివి..!!
స్వాముల.. ఆశీర్వాదాలు
సన్యాసుల.. ఆశీషులతో
తృప్తి చెందుతూ కష్టాని
మరిచి పోతున్నావు..!!
శ్రమవిలువ
తెలుసుకోలేక పోవుచున్నావు..!!
మూఢ నమ్మకాలు ఎక్కడో..!!
ఒక దగ్గర ముంచేస్తాయి..!!
విజ్ఞానశాస్త్రం వికశిస్తున్న కాలంలో
అజ్ఞాన చీకట్లోనే నడుస్తుంటే
ఇక మార్పు ఎక్కడ..??
దాచేస్తే దాగని సత్యం..!!
పరిశీలించే.. పరిపక్వత ఉండి..
పరిగ్రహించే పరితపన ఉండి..
అన్నీ గ్రహించే ఆలోచన శక్తి ఉండి..
అంతా నిరాశతో దూరాలోచనతో..!!
మూఢనమ్మకాల
దారిలో నడుస్తున్నావు..!!
ఇదో..దుర్మార్గపు దురాచారం..!!
ఆత్మతో అంతరాత్మతో ఆలోచించండి
ఉరుకు పరుగుల వ్యవస్థలో
మూఢనమ్మకాల
అవస్థలు పడుతున్నావు..!!
నీలోని నిజమైన శబ్దాన్ని నిద్రలేపు..!!
అబద్దల్ని అద్భుతం చేయకు..
మూఢ నమ్మకాలతో
అందరిని మోడులుగా మార్చకు..
విజ్ఞాన సౌదామి మీద..
అజ్ఞాన జెండా పాతకు..!!
అఖండ దీపంలావిజ్ఞాన
వెలుగులు అంతట నిండాలి..!!
అందరూ మూఢనమ్మకాల నుంచి
బయట పడాలి..ఇదొక వ్యశనం..!!
తెలుసుకొని నడుచుకోవాలి..!!