Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్ - 9110784502
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
తిండి కలవాడే కండ కలవాడు
కండ కలవాడే మనిషోయ్ అంటూ
ప్రభోధగీతాన్ని రచించి ఆంధ్రరాష్ట్రాన
ఆబాలగోపాలాన్ని అలరించిన
"తెలుగుబిడ్డ" - మన గురజాడ
వేశ్యావృత్తిని కథాంశంగా తీసుకొన
కన్యాశుల్కమనే సాటిలేని మేటి
సాంఘిక నాటకాన్ని వ్రాసి
సంఘంలోని దురాచారాలను
మూఢాచారాలను రూపుమాపిన
గొప్ప "సంఘ సంస్కర్త" - మన గురజాడ
వాడుక భాషలో కన్యాశుల్కం
ముత్యాల సరాలు పుత్తడిబొమ్మల
వంటి విశిష్ట రచనలు చేసి
మిత్రుడైన గిడుగుతో కలిసితెలుగు
భాషోద్యమానికి తనవంతు కృషి చేసిన
గొప్ప "భాషాభిమాని" - మన గురజాడ
బాల్యవివాహాలను వ్యతిరేకించిన
గొప్ప "మానవతావాది" - మన గురజాడ
మహిళలకు సమాజంలో
ఉన్నతమైన మహోన్నతమైన స్థానాన్ని
కల్పించిన "ఆదర్శవాది" - మన గురజాడ
అందుకే...మన
అప్పారావు సదా చిరస్మరణీయుడు
ఆయన అడుగుజాడల్లో నడవడం
ప్రతి తెలుగోడి ప్రథమ కర్తవ్యం
జయహోజయహో
ఓ తెలుగుతేజమా !
జయహోజయహో
ఓ అరుణోదయ కిరణమా !
అప్పారావు జన్మదినం
తెలుగు జాతికే గర్వకారణం