Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణవేణి గడప, సికింద్రాబాద్
9553957075
వాడుక భాషకు ఊతకర్రలా మారినా గురజాడ
అందరూ వారి అడుగుజాడల్లో నడిచారుగా
సృష్టించిన పాత్రలతో మాట్లాడించగల
అభ్యుదయ కవితా పితామహుడు
కన్యాశుల్కం సాంఘిక నాటకంతో
ఎందరో మూసుకుపోయిన కళ్ళు తెరిపించారు
దురాచారాలపై గొడ్డలి పెట్టు గా మారి
మార్పు కోసం వేసే ధైర్యంగా ముందడుగు
పూర్ణమ్మతో కన్నబిడ్డల్ని డబ్బుతో తూకం వేసే
ఎందరో తల్లిదండ్రులు ఉలిక్కి పడేలా చేశారు
అర్థం లేని నమ్మకాల దుమ్ము దులిపేయ
తూర్పున ఉదయించినా సాహితీ సూర్యుడు
ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలెట్టవోయ్ అంటూ
సోమరులకు మేలుకొలుపు పాడినా కవి శేఖరుడు మన గురజాడ