Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--దార్‌కు.కవిత, హైదరాబాద్,
తెలంగాణా లోన జానపదుల మేళా
రంగురంగుల పూలు రంగరించే వేళ
పువ్వుని పూజించే తెలంగాణా నేల ప్రకృతిలో విరబూసే రంగుపూలు చూసి..
ఆడబిడ్డల మనసు విచ్చుకున్న వేళ
సెట్టు పుట్టా తిరిగి పూవులన్నీ తెచ్చి
ఉపవాస దీక్షతో గౌరమ్మ ను పేర్చి
ముస్తాబైరీ పడతులు నగ నట్రా బెట్టి
పట్టుచీర గట్టి నుదుటబొట్టు పెట్టి
అమ్మలక్కాలచ్చె ఆరుబయట ఆటాడ ....
అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే వేళ
చేతితో ఆటగట్టి నోటితో పాటగట్టి
ఐక్యతచాట ఆడబిడ్డల ఆట
రంగు సిలకల నడుమ బంగారు గౌరమ్మ
తనివితీరా ఆడి మనసుతీరా పాడి
గంగలో గౌరమ్మ పూలతోటి మెరిసె
బతుకమ్మను బంపె ఆడబిడ్డలంత గూడి
తెలంగాణా సంస్కృతిని తెరమీద చూపించి
మనసుపై ముద్రించే మగువలు ఆట
మన బతుకమ్మ ఆట....
తెలంగాణా పుడమి పులకరించే ఈ పూట