Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--ప్రసాద్ తుమ్మా
హైదరాబాద్
9985438002
తెలుగు సాహిత్యంలో కొత్తపోకడల ఓడ
గర్వించదగిన మనిషి మన గురజాడ
విశ్వ దేశాలను తన కవితలో ప్రేమించినవాడు
దేశం మట్టి కాదు మనుష్యులని తెల్పిన సత్యవంతుడు ,
కలలను కలంలో కావ్యంగా మార్చి
హేతుబద్ధ భావనలను అక్షరీకరించి
ముత్యాల సరాలను యేర్చి కూర్చి అందించినవే
తెలుగు వెలుగుల అక్షరమాలలు ,
హేతుబద్ధ భావనల జీవ భాషకై
వ్యహారిక భాషోద్యమ కర్తయై
అభ్యుదయ కవితాపితామహుడైన కవిశేఖరుడు
సామాజిక దురాచారాలపై సంధించిన శరాలు
కన్యాశుల్కం, పుత్తడి పూర్ణమ్మ,
తన బాటనుఁ ప్రజాబాటకు అంకితమిచ్చి
ప్రజాహృదయాల్లో నిత్యం నిల్చిన అగ్రగణ్యుడు
మన మనస్సులో తన పాత్రలను
నిత్యం వెతికించ్చే మహాకవి ,
సంస్కారయుత భాష వ్యక్తీకరించి
ఒంపుసొంపులతో కొత్తవెలుగులు నింపి
తెలుగు జాతి బహుముఖ వికాసానికి
ఓ చుక్కానియై చూపిన జాడ గురజాడ.