Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
నరసరావుపేట, గుంటూరు
8500988499
విశాఖలో రామదాసు,కౌసల్యలకు
జనించిన మనస్కమా...
పేదరిక జాడ్యం నుండి ఉన్నతికి
ఎదిగిన గగన కుసుమమా...
ఉపాధ్యాయ, సేవాహృదయ
కలాయుధ చరిత్రమా...
కుళ్లిపోయిన సమాజోద్దారశోధకా
దిద్దుబాటు శ్రీకారమా..
సాహిత్య వాడుక భాషాప్రయోగ
గిడుగుస్నేహ గురజాడమా..
దేశమును ప్రేమించుమన్నా అన్న
దేశభక్త గేయ కవిరాజమా...
మీ కలాన నేటి సమాజ కనువిప్పుకై
నాట్యమాడిన గజపత ప్రాంతీయ యాసల కన్యాశుల్కం,పుత్తడిబొమ్మ పూర్ణమ్మలు
మార్చలేవా భావితరపు బాటను..
కవిత్రయమంటే తిక్కన, వేమన,గురజాడెనన్న
శ్రీ శ్రీ పలుకుల అభ్యుదయ కవితా పితామహమా..
మీ అక్షర విత్తుల సేద్యంతో
నేటి దిగజారపు జాడ్యాలకై..
మళ్లీ పుట్టవా జనరంజక జనోద్దారకా
మా గురజాడ వెలుగుజాడమా...