Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళంగి.వసంత జెస్సన్, ఖమ్మం
9490967433
దేశమును ప్రేమించుమని
దేశమంటే మట్టి కాదని
మనుష్యుల మధ్య ప్రేమను పంచి
ప్రేమ జాడ తెలిపిన గురజాడ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్యాశుల్కం
రచనలతో సంఘంలోని దురాచారాలను
రూపు మాపిన సంఘ సంస్కర్తౌ హేతువాది
తెలుగు సాహితీవేత్తౌగురజాడ అప్పారావు
విశాఖ లోని రాయవరంలో
వెంకట రామదాసుౌకౌసల్య దంపతులకు
జన్మించి జన్మను సార్థకం చేసిన
ప్రజల మనిషిౌవట్టిమాటలు కట్టిపెట్టిన గట్టి మనిషి
అధ్యాపకునిగాౌగిడుగు వారి స్నేహితునిగా
తెలుగు భాషాభి వృధ్ధికైౌవ్యవహార భాషోద్యమంలో
పాల్గొనిౌవాడుక భాషలో రచనలు చేసిన
అభ్యుదయ కవితా పితామహుడు కవిశేఖరుడు
దేశాన్ని ప్రేమించమంటేౌదేశాన్నే మింగే బాబులు
అన్న దమ్ములుౌఅక్క చెల్లెళ్ళుగా మెలగాలంటే
వారిపై అకృత్యాలు అరాచకాలు జరుపుతూ
గురజాడాౌఎక్కడయ్యా నీ జాడ
పాఠకుల మనసునౌప్రజల గుండెల్లో నిలిచిన
మహా మనీషిౌనడవాలి మనం వారి అడుగు జాడలో