Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--అయిత అనిత
8985348424
జగిత్యాల
ఏ శుభ సమయాన
నీ ఇంటిముంగిలిలో అడుగిడానో గానీ.....
నా పాదాల పారాణి మనహృదయ గుమ్మానికి పచ్చని తోరణమయ్యింది!
ఏ మేళతాళాల్లో
నీ చేతిలో చెయ్యేసానో గానీ...
నా అడుగుల సవ్వడి
నీ మదికోవెల్లో గుడిగంటై మ్రోగింది!
ఏ వేదమంత్రాలతో
తడిసిందోగానీ...
నా కాలిఅందియల చిరుసడి
మనపొదరింట్లో
ఆనందరాగమై ప్రతిధ్వనించింది!
ఏ దేవతల ఆశీర్వాదాలలో
మునకలేసిందోగానీ...
నా రాక ! మరీచికలైన విజయసోపానాలను నీ దారిలో పేర్చింది!
పదపదమని
పరవశాల పరుగుల
పాదయాత్ర చేద్దామా...!
ఎదపాదపు మువ్వలసవ్వడులే జైత్రయాత్రగా వినిపిద్దామా!!
అన్యోన్యదాంపత్యపు వెన్నెల పందిరికింద
సేదదీరుదామా!