Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శశికళ.బి
ఆ.వె
ఉజ్వలముగ కీర్తి యున్నత పాండితీ
అన్ని కళల లోన ఆరి తేరి
సర్వ సుఖములొదిలి శార్వాణి సేవించె
ఆదరించిరామె నందరచట !
ఆ.వె
కొలను చెంత నున్న కోవెల చేరెను
రోజు పోవు చుండె పూజ చేయ
పూలు కోసి యామె మాలలు వేసెను
రాజు యొకడు జూచి మోజు పడెను !
ఆ. వె
మనసు గెలువనతడు మాటలు గలిపెను
చేయి పట్టబోయె చెంత చేరి
కనుల తోడ నామె కలవర పెట్టగా
కఠిన శిలగనామె కానబడియె!
ఆ.వె
తల్లి వద్ద చేరి తనివి తీరగ యేడ్చె
అన్న చెంత చేరి అంత జెప్పె
తండ్రి తోడ జెప్పె తన బాధ అంతయు
అంతు లేని బాధ ననుభవించె!
ఆ.వె
పెండ్లి తలపు లేదు పేరాశ లేదని
పెద్ద మనసు మంచి బుద్ధి కలిగి
బద్ధు రాలినైతి భగవంతు సేవకు
హద్దు లోన యుండు యవని ఱేడ!