Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.వె
యజ్ఞ యాగ క్రియలు ఆలయాన జరిగె
అచ్చెరువుగ యామెనచట చేరె
ఆడుబిడ్డ వారి కభివాదమును జేసె
ఆచి తూచి మాట లాడెనామె!
ఆ.వె
నేల యీనినట్లు నిండిరి జనులంత
ప్రౌఢి మాటలాడె ప్రజల తోడ
కన్న వారి కనులు కన్నీటి సంద్రాలు
చేతులెత్తి మ్రొక్కి సెలవు కోరె!
ఆ.వె
వెలగ గలను నేను వేల సూర్యులుగను
స్ఫూర్తి నీయవయ్య కీర్తి పెరుగు
ప్రజ్ఞ తోడ నామె యజ్ఞాన్ని దలపించె
అగ్ని గుండమందు ఆహుతయ్యె!
ఆ.వె
పట్ట రాని బాధ పంటి బిగువు నుంచె
అంధకారమయ్యెనతని జూపు
అందరచట జూచి ఆశ్చర్య పోయిరి
అంత మొందె నపుడు యతని చరిత!
ఆ.వె
సీత చరిత కాదు నైతిక దర్శిని
తీరు దెలుపు మనకు భారతమ్ము
మాతృ భాష నందు మహనీయ చరితలు
బలి పశువులు కాదు బతకనివ్వు!
ఆ.వె
బండి నడువ గలదు రెండు చక్రములతో
కనులు రెండు గలవు కాంతి జూడ
పక్షి కవసరమ్ము పక్షముల్ రెండును
ఆదరించు మహిళ నవనియందు!
శశికళ