Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వజ్రాల సత్యవతి
8142093328
ఆధునిక యుగంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా తమ ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నారు. విద్యాపరంగా స్త్రీలు ఈనాడు చాలా ముందంజలో ఉన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతికతను ఉనయోగించుకుంటూ జీవనగమ్యాన్ని చేరుకుంటున్నారు ఈనాటి వనితలు. అయితే స్త్రీకి సమాజంలో ఈనాడు గౌరవమైన స్ధానము ఉందా అని మనం ప్రశ్నించుకుంటే దానికి జవాబు ప్రశార్ధకమే? ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులో అనేక విధాలుగా స్త్రీలు హింసకు (శారీరకంగా, మానసికంగా ) గురి అవుతున్నారు. పూర్వకాలం స్త్రీకి స్వేచ్ఛ లేకపోవచ్చు లేదా తక్కువ ఉండవచ్చు. విద్యలో అంతగా రాణించ లేకపోవచ్చు కాని ఈ కాలంలో పోల్చిచూస్తే స్త్రీకి ఆ రోజులలోనే సముచితమైన గౌరవం దక్కింది అని చెప్పవచ్చు. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు సమాజంలో అందరు కూడా మగాడి చేతిలోహొ స్త్రీకి అవమానం, ఇబ్బంది లేదా హింస అన్యాయం అవుతుంది. అనేది మామూలుగా చెప్పే విషయం అయితే అది వాస్తవం అయినస్పటికీ కూడా స్త్రీ నిరాదరణకు గురికావడానికి ఇప్పటి పరిస్థితులలో 100కు 75 శాతం స్త్రీలే కారణం అవుతున్నారు.హొ స్త్రీ ఆలోచనా విధానాలు మారాలి.హొ తమ విలువలను తామేకోల్పోతున్నాము అనేది వారు గుర్తించాలి. ఈరోజు స్త్రీ అనేది ఒక విలాస వస్తువుగా, జోకర్ గా చెప్పుకుంటే ఇంకా చాలా రకాలున్నాయి. అంత దిగజారుడు పరిస్థితి స్త్రీకి అవసరమా! మనం ఒప్పుకుంటే అక్కడ ఏమైనా జరుగుతుంది. ఉదాహరణకుహొ కొంతకాలం కింద వరకు పంటపోలాలో ఒక దిష్ఠి బొమ్మను పెట్టేవారు.హొ ఇప్పుడు అర్థనగ్నంగా ఉన్న ఒక స్త్రీబొమ్మ ఉన్నహొ ఫ్లెక్సీలకు పెడుతున్నారు. ఆ చిత్రంలోని స్త్రీ చాలిచాలని దుస్తులతో చూడటానికి ఇబ్బంది కలిగేరా ఉంటుంది. అంటే ఈ చిత్రంలోఉన్న స్త్రీకి ఏమాత్రం గౌరవ అనేది ఉండదు. ఇలాంటి సంఘటనంప్రస్తుత సమాజంలో కొకొల్లలు. దీనికి కారణం ఎవరు? స్త్రీలు గౌరవించబడాలి అంటే ముందు మన వ్యక్తిత్వం గొప్పగా ఉండాలి. కుటుంబ నియమాలు పాటించాలి. వాటితో పాటుగా శారీరక ధర్మాలను అనుసరించాలి. సమాజం ఆమోదించే రీతిలో మన జీవన ప్రమాణాలను పెంచుకోవాలి. సమాజం అనేది ఎప్పుడూ మార్పులు కోరుకుంటుంది. మనం వాటిని అనుసరించాలి. అంటే మంచి విలువలను మన ద్వారా అందరికి పంచాలి. కుటుంబ వ్యవస్థని గౌరవించాలి. వివాహ వ్యవస్ధని గౌరవించాలి. ప్రస్తుతం వివాహం అనే దానికి అసలు విలువ అనేది ఇవ్వడం లేదు.హొ ఎంత త్వరగా మనం ఎదగాలని అనుకుంటున్నామో అంతే త్వరగా వెనకకు పడిపోతున్నాము. ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. దానిని దాటితేనే ఇబ్బంది అనేది వస్తుంది. చదువుకొన్నవారితో వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రస్తుతం స్త్రీ గొప్పా,పురుషుడు గొప్పా అనేది మనం ప్రశ్నించుకోకూడదు. ఒక స్త్రీ సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతోకొంతవరకు అయినా పురుషుడు ( తండ్రిగా, అన్నగా, భర్తగా లేదా స్నేహితుడిగా ) చేయూత అనేది ఉంటుంది. అదేవిధంగా పురుషుడి ఎదుగుదలకు స్త్రీ చేయూత ఉంటుంది. అది సర్ధుజాగు చేసుకోవటంలో నిర్ణయించబడుతుంది. సర్ధుబాటు చేసుకోవటం అంటే ఇక్కడ తమని తాము తక్కువ చేసుకోవటం కాదు. కారణాలు ఏమైనా ప్రస్తుత పరిస్ధితులలో ఈనాటి స్త్రీ సమాజంలో ఎంత ముందంజలో వుందో కొన్నిహొ సందర్భాలలో స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కూడా కొల్పోతుంది అనడంలో సందేహం లేదు. కాలాలు మారినా యుగాలు మారినా స్త్రీ తనను తాను కాపాడుకోవడానికి తనే తయారుగా ఉండాలి. మానసికంగా ధృఢత్వం కలిగి ఉండాలి. మార్పును ఆహ్వానించడం తోపాటు ఆచరణలో పెట్టాలి. చట్టాలు, ధర్మాలు , న్యాయం అన్ని కూడా ఆచరణ యోగ్యమయితేనే సమాజం ముందుకు నడుస్తుంది. ఈనాడు స్త్రీలు సాంకేతిక పరంగా ఎంతో ఉన్నతంగా రాణిస్తున్నారు గాని దానితో పాటుగా తన వ్యక్తిత్వాన్ని అంతకంటే ఉన్నతంగా పెంచుకోవాలి. అప్పుడు వచ్చే గుర్తింపు ఎప్పటికీ నిలుస్తుంది. 'ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో' అక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెబుతారు. ఎంతో మంది మేధావులు,హొ కవులు, రచయితలు సమాజంలో స్త్రీ స్థానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటిని మహిళలే దృష్ఠిలో పెట్టుకొని మన నడకను సాగించాల్సిన సమయం ఇది.
ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మనకి ఏదోకావాలని తాపత్రయం పడకుండా మనం మనలాగే అంటే మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, నీతి నిజాయితీ ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మనుగడ సాగించినపుడు మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను గమినిస్తున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. కాని అక్కడ మనం ఏమీ చేయలేని నిస్సాహయ పరిస్ధితి అంటే ఒక స్త్రీ తనే తనజాతికి అన్యాయం చేస్తున్నారు అనేది తెలుసుకోలేకపోవటం.