Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు..ఎప్పుడు
మారేది మనమే..కాలం కాదు..
ఎప్పటికి.. కాలాని అనుసరించడమే..!!
కాలం చెప్పినట్లు నడుచుకోవాలి..!!
ఈ విశాల విశ్వానికి..ఓ అధికారి
పిలుపు అందుకొని..
పరుగుతీయాలి..
మనచేతులో.. ఎమీలేదు
అంతా కాలమే నిర్ణయిస్తుంది..!!
ఇది మనకు రుచించక పోవచ్చు
కాలం ఆధీనంలో
ఉన్నామని మరువొద్దు..!!
కాలమే శాసనం
కాలమే ఈ వ్యవస్థకు సూత్రధారి..
కాలాన్ని దాటేసి ఎవరు పొలేరు..!!
కాలం ఓ నియంత !!
కనికరిస్తుంది
కఠినంగా ప్రవర్తిస్తోంది..!!
అందరి అంతు చూసేది..!!
అమ్మ పొత్తిళ్లలోనుంచి ..
పుడమిపై పడ్డప్పుడే..
కాలం ఆదినంలోకి పోయాం..
ఎంత ప్రయత్నం చేసిన
కాలం చూపుతోనే ఫలితముంది..!!
డబ్బురావాలన్న
జబ్బు పోవాలన్న కాలమే..
కాలం తీగకు కాసిన కాయలం..!!
మన అందరికి కాలమే ఆధారం..!!
గాలిలో మెడలు కట్టుకోవద్దు..!!
కాలంతో రాజీపడాలి
కాలం ఉదయానే
వళ్ళు విరుచుకు లేసి
సమస్తాన్నికి దర్శనం ఇస్తుంది..!!
ఈ బంధాలు అనుబంధాలు
కాలంతోనే ముడిపడింది..
మురిచి పోకు ..
కాలం ముందుందని మరిచిపోకు..!!
ఏదైనా పడగొట్టాలన్న
లేపి నిలబెట్టాలన్న కాలమే..!!
ఎప్పుడైనా ఎక్కడైన..
పరకాయ ప్రవేశం చేయగలదు..
మనమంత కాలానికి
తలవంచాల్సిందే..!!
ఓ అధికారిగా ప్రణాళిక బద్దమైన
సూత్రప్రాయంగా నడిపిస్తుంది..!!
కాలం ముందర ఎన్నెన్నో శతాబ్ద
చరిత్రలు కదలిపోయినవి..
కాలం ముందర
అందరం చిన్నగై పోతాం..!!
మానం చేసే ప్రతిపని
కాలం కనిపెట్టి చూస్తుంది..!!
తప్పుచేసిన ప్రతిసారి
సమాధానం చెప్పాల్సిందే..!!
కాలం తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే ..!!
అనుకూలమైన కాలం కోరకు
ఎదురు చూడాల్సిందే..!!
కాలం వేగం అంచన వేయలేం..!!
దాని నడక దానిదే..
కాలం మన అందరిది
అనుకూలంగా నడుచుకోవాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
22-9-2020