Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహరికోటి, ఏలూరు
1. సీ.
రైతు మార్గము ధాన్య రాశులై భాసిల్లి
యాకలి చావుల నాపు పథము
ధాన్య రాసుల సిరి ధన రాసులుగ మారి
కోరిన కోర్కెలు తీరు పథము
పాడి వృద్ధియు గల్గి భారతాంబ హసింప
క్షీరాభిషేకము జేయు పథము
పచ్చ పచ్చల పైరు పసిడి కాంతుల తీరు
భారతావని కిది ప్రాణ ప్రథము
తే.
పాడి లేక పిల్లలను కాపాడ లేరు
పంట లేక నే వంటలు వండ లేరు
పాడి పంటలు లేక నే ప్రజలు లేరు
పాడి పంటలన్ దేశ సంపదలు తేరు.
2. తే.
ధాన్య రాసుల వల్లనే ధనము పెరుగు
మహిని ధనముచే దాన ధర్మాలు పెరుగు
నట్లు ధాత్రిలో దాతల ఖ్యాతి పెరుగు
నంత పాడి పంటల సిరి యవని కెరుగు.
3. తే.
పాడి పంట లనిన పల్లె సీమల సిరి
రైతు పనుల కివియె ప్రాణ ప్రథము
పల్లెటూళ్ళు దేశ పట్టుగొమ్మ లనుట
కిదియె కారణమ్ము యిప్పుడమిని.