Authorization
Wed April 16, 2025 03:39:48 am
- గుడిమెట్ల చెన్నయ్య
చెన్నై
97907 83377
నీవో అపూర్వ సాహితీ స్రష్ఠవు
వ్యాపించినది నీ కవితా సౌరభము దిగంతములు
జగద్వితములు నీ ఆధునిక ఆంధ్ర సాహిత్య విశేషములు
అనంత కాంతులతో ఆంధ్రభారతిని అలంకరించే రత్నాల రాశి నీ ఫిరదౌసి
నీ ముంతాజ్ మహల్ ఓ మహత్తర కావ్యం
అల్లుకు పోయాయి తెలుగువారింట నీ కవితాలతా మల్లికలు
కన్నుల కద్దుకొనుచున్నారు కవికుమారులు నీ కవితా ప్రసాదమును
అభిషేకించావు తెలుగువారిని నీ కవితా సుధా ధారలతో
క్షుధాగ్ని పీడుతుని ఆకలి సందేశం నీది
కన్నీటి చుక్కని సిరా చుక్కగా చేసి నీ కవిత ద్వారా అందిస్తున్న అశ్రు సందేశం నీది
మానవత్వాన్ని మేల్కొలిపే మతం నీది
కులమతాల తారతమ్యాలను నిలదీస్తూ మార్పు కోసం చేసే పోరాటం నీది
నీవో విశ్వకవి సమ్రాట్ వి
విశ్వవిద్యాలయాలచే బిరుదు పొందిన కళాప్రపూర్ణుడివి
భారత ప్రభుత్వముచే మన్నలను పొందిన పద్మభూషణుడివి
వేనకు వేల సన్మానాలు సత్కారాలు పొందిన నవయుగ కవిచక్రవర్తి వీవు
తిరుగు లేదు నీకు విశ్వ నరుడ వీవు