Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగనాధ్ దేశిరాజు
9703643447
ఓ
విశ్వనరుడా
గాయమనే
కుంపటినుంచి
నిప్పుకణికను
తీసి
కలంగా జేసికొని
అతి మాధుర్యమైన
తెలుగు తేనె లో ముంచి
వేదనా కవితను
మలచి
చదువరుల కనులలో
వెలువడే నీటితో
పాటుగా
పెదవులపైచిరునవ్వులనూ
పూయించగలగడం
నీకే సరి
భీకర
భస్మసింహాసనాన్నే
నీ
మధుర
కవితాభిషేకంతో
ఉర్రూతలూగించగల
కవికోకిలవి
వివక్షతా రంకెలను
ప్రశంశా గీతాలుగా
మలచుకోగలిగిన
గండపిండేరమా!
శారదాపీఠాన్నాక్రమించి
తెనుగుకవితా
సామ్రాజ్యాన్నేలిన
మధుర కవి!
కుహనా
వివక్షతా సంస్కృతీ
సాంప్రదాయ
భావజాలాన్ని
' గబ్బిలం 'తో
తలక్రిందులుజేసి
కైలాసనాధుని కే కబురంపిన
. సందేశ కావ్యకర్తా!
కమ్మని కావ్యమా! ,
గుర్రాన్ని ఇంటి వద్దనే వదిలి
గజరాజు పై ఊరేగిన
కవిరాజు!
జాషువా!
సహస్రాధిక వందనాలు .