Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూర దేవానందం
9494996143.
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి
అన్న మహాకవి గురజాడ
నేటి కవితకు ఆయనదే అడుగుజాడ..
కన్యాశుల్కం నాటకం రచించినాడు
సంఘంలోని దురాగతాలను ఎదిరించినాడు
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం రాసినాడు
బాల్యవివాహాలను ఖండించినాడు..
గ్రాంధికభాషా పెత్తనాన్ని
ఎదిరించిన సాహాసి అతడు
కవితా రచనకు
వాడుక భాషను వాడినాడు..
తెలుగు సాహిత్యగమనాన్ని మార్చినాడు
ఆధునిక కవిత్వానికి ఆధ్యుడైనాడు
జటిలమైన భాషమాటున దాచిన కవితను
జనం భాషలోకి తెచ్చినాడు..
గుండె ధైర్యంతో గురజాడ
ఆ మహాకవికి ఇదే నా అక్షర పూలదండ