Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డా. కొణిదల శోభ, తిరుపతి
9704918212
గురజాడ అడుగుజాడ
తెలుగువారికి వెలుగుజాడ
ఆ మహాకవి జననం
ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
నిజ జీవిత ప్రతినిధులయిన పాత్రలతో
వాస్తవ జీవిత నేపథ్యంతో
తెలుగు సాహితీ మాగాణంలో
అద్భుత రాజనాలు పండించి
పసందైన సాహితీ విందు గావించిన సాహితీ వేత్త
సాంఘిక దురాచారాలను తొలగించి
సమాజాన్ని సంస్కరించి
నవ చైతన్యాన్ని తీసుకొచ్చిన
సంఘ సంస్కర్త
వ్యావహారిక భాషకు పట్టం కట్టి
సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి
సాహిత్యాన్ని సమాజ పరం చేసిన ప్రజా కవి
సంక్షుభిత సమాజానికి శస్త్ర చికిత్స చేసి
విశ్వ మానవ ప్రేమను ప్రబోధించిన మానవతా మూర్తి
మరణించాకే జీవించడం ప్రారంభించిన అరుదైన వ్యక్తి గురజాడ
హామీ పత్రం :ఇది నా సొంతం రచన. దేనికి అనుకరణ కాదు.