Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగీతం సంతోష్ కుమార్
రుద్రారం, కామారెడ్డి.
ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం గల కవి!
తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన చిరస్మరణీయుడు!!
ఆయన పద్యాలలో సౌందర్యం గుండెలను తాకుతూ!
కవిత్వాన్ని ఆయుధంగా మార్చి!!
మూఢాచారాలపై తిరగబడ్డా మహాకవి !
జాషువా తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయిన మహాకవి!!
తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి!
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది!!
ఆయన సృష్టించిన సాహిత్యం లో స్పృశించని అంశం లేదు
జాషువా కవితా కంఠము విలక్షణమై!
సంఘసంస్కరణ
ఆయన కావ్యలక్ష్యం వర్గ సంఘర్షణ
ఆర్ధిక వ్యత్యాసాల దోపిడి వర్గాల పై తిరుగుబాటు చేసిన అభ్యదయ కవి!
గబ్బిలం బాపూజీ కొత్తలోకం ముంతాజ్ మహల్ నా కథ
కాందిశీకుడు ఆంధ్రమాత నేతాజీ గ్రంధాలు !!
ఎన్నో రచనలు రాసిన మహా కవి!
భారత ప్రభుత్వంపద్మభూషణ్ తో సత్కరించింది!!
కవికోకిల ,కవితా ,విశారద నవయుగ కవి చక్రవర్తి
ప్రాచీన సాహిత్యమంతా రాజులను కీర్తించడంలో
అగ్రవర్ణాల ఆధిపత్యాలను చాటి చెప్పడంలో
భగవంతుని భజనలో మునిగిపోయింది వర్గాలకు దూరమైన
గబ్బిలంలో ఒక దళితున్ని కథానాయకునిగా చేసి !
వారి జీవితాలకు నవయుగ కవిచక్రవర్తి!!
కవితా విశారద మధుర శ్రీనాథ కవి కోకిల
విశ్వకవి సామ్రాట్ గా పేరుగాంచిన కవి కవికోకిల......