Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆళ్ల నాగేశ్వరరావు , తెనాలి
7416638823
స్వాతంత్య్రం సాధించి
ఏడు పదులు దాటినా
నేతి బీరలో నెయ్యిలా
పాలకూరలో పాలులా
ఎడారిలో ఒయాసిస్సులా
నేటి సమాజంలో సామాజిక న్యాయం అలా !
తడబడు నడకలతో
పడుతూ లేస్తూ నడుస్తున్న తరుణంలో
అంబేద్కర్ గారి చొరవతో
వీరికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు
రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి
ఆ రిజర్వేషన్ల పైనే పాలకుల కళ్లూ పడ్డాయి !
రాజ్యం గం ప్రకారం వీరిని పాలకుల్ని చేసినా
అధికారం చెలాయిస్తూ, పాలన సాగించేది మాత్రం వారే !
తెల్ల దొరల నుంచి విభజించి పాలించడం
నేర్చుకున్న మన వాళ్ళు
రిజర్వేషన్ వర్గీయుల్ని A, b, c, d గ్రూపులుగా
విడదీసి
వారిలో వారికీ పోటీలు సృష్టించి
ఆ ఉద్యోగాల్ని రాబందుల్లా తన్నుకు పోతున్నారు వారు !
ఉచితాలు, రాయితీలు వీరికి అందించి
ఉన్నతస్థాయికి ఎదుగు తున్నారు వారు
ఉన్న చోటనే ఉంటున్నారు వీరు !
అధికారం లోకి వచ్చిన ప్రభుత్వాలు
చిటారు కొమ్మన సామాజిక న్యాయమనే
మిఠాయి పొట్లాన్ని చూపిస్తూ పబ్బం
గడుపుకుంటున్నారు
అందని ద్రాక్ష పుల్లన అనుకుంటూ
అందిన దానికే ఆనంద పడ్తున్నారు వీరు !
నేటి సమాజంలో సామాజిక న్యాయ సాధనకై
కవులు, కళా కారులు, మేధావులు మౌనం వీడి
వాడి, వేడి శరాలతో సమరం కొనసాగిస్తూ
మహాకవి జాషువా అడుగు జాడల్లో నడుస్తూ
సామాజిక న్యాయం కోసం ఇకనైనా పోరాటం సాగించాలి !