Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి. శశికళ
సీ.ప
హృదయ కమలమందు సృజియించె శ్రీహరి
అలమేలు మంగమ్మ అలుక దీర్చ
ఆనంద పరిచావు ఆరాధ్య దైవాన్ని
అవలీల పలికించి నవరసాలు
అన్నమాచార్య అన్ని కీర్తనలును
ఆణిముత్యములుగ అమరెనయ్య
సరిగమ పదనిస సప్తస్వరములును
చేశావు సాహిత్య సేవ నీవు!
ఆ.వె
పదిలముగ దాచి పదహారు కళలను
మదిని దోచినావు పదముకట్టి
నిదుర బోవునపుడు నీరాజనమ్ములు
మధుర గానసుధలు మాధవునికి!