Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శశికళ.బి
సీ. ప
మురళి చేతనుబట్టి మోహనాకారుడు
గోపెమ్మతో వచ్చె గోపబాల
పాలు,పెరుగు వెన్న పనిబట్టుజూడగ
గొల్లభామలిపుడు గొల్లుమనును
కోలాటమాడును కోమలాంగుల తోడ
కొంటె కృష్ణుని వారు కొలుతురి పుడు
చీరలన్నియు దోచు చిలిపి కృష్ణుడిపుడు
చిరునవ్వు చిందించు చెలుల జూచి!
ఆ.వె
ద్వాపరంబు నందు దామోదరుడు బుట్టె
వచ్చినాడు నేడు వసుధ జూడ
దేవ దేవుడితడు దేవకీ దనయుడు
వందవందనాలు సుందరాంగ !