Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శశికళ. బి
సీ.ప
బుంగ మూతిని బెట్టె బంగారు బొమ్మరా
చెంగుమని యెగురు చేప పిల్ల
ఆడపిల్లలు లేరు ఆడేది యెట్లార
అన్నతో చెప్పింది అలుక పూని
చింతించ బోకమ్మ చెల్లాయి నీవమ్మ
చిన్ని కృష్ణుండు నీ చెంత గలడు
గోపిక హృదయుడు గోప బాలకుడను
గోపికల పిలుతు కోమలాంగి!
ఆ.వె
అలుక మానవమ్మ అందాల పూరెమ్మ
పలుకు పలుకవమ్మ పసిడి కొమ్మ
చిలుక పలుకు లేక చింతింతు నేనమ్మ
కలను కూడ అలుక తలపకమ్మ!