Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
చదువుల సామ్రాజ్ఞి ముదముగా యిటువచ్చి
చిన్నారి జవరాండ్ర చేర బిలిచె
ముంగురు తుమ్మెదల్ ముఖచంద్ర బింబము
ఉదయించు సూర్యుడే నుదుటి బొట్టు
ఇంద్ర ధనుసు వోలె యింపు గన్నుల తీరు
కన్నుల వెన్నెల కాంతి కురిసె
సంపెంగ అందాలు సొంపైన నాసిక
పగడాల పెదవుల పలకరింపు !
ఆ.వె
చుబుకమందు యమరె జూడచక్కని చుక్క
పలు వరుసలు ముత్యముల సరములు
జుక్కలున్న చీర జక్కనీ యాకసం
అమ్మ వారి రాజ హంస నేను!
-శశికళ. బి