Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి. శశికళ
సీ.ప
హరి హర స్మరణము నిరతము జేయును
శ్రీకర శుభకర శ్రీనివాస
తరములు మారిన స్థిరముగ కురియును
సిరుల కిరణముల వరము కలుగు
తరగని చదువులు శరతుకిరణములు
కరుణను జూపగ దరికి జేరు
చరణములను వేడి శిరమును వాల్చెను
మురిపాల కృష్ణుడు శరణు దీపు!
ఆ.వె
జన్మదినము నాడు జాలువారును కీర్తి
చరిత కలుగునయ్య శరణు దీపు
మాత పితరులన్న మమకారమును జూపు
మాన్యు డౌదువయ్య మమతనొంది!