Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి. శశికళ
సీ.ప
పద్మ నాభుని చెంత పవళించు లక్ష్మిలా
పరమశివుని చెంత పార్వతమ్మ
రాధమాధవులుగ రంజిల్లవలయును
సీతరాముల వలె సేదతీరి
పచ్చగా వర్థల్లు పదికాలములపాటు
పిల్లపాపలతోడ చల్లగాను
చంద్రుని వెలుగుతో సౌభాగ్య వతిగాను
కురియాలి నిత్యము విరులవాన!
ఆ.వె
పొందికైన జంట పొదరింట మీరుండ
కలుగుచుండు మాకు కనులపంట
పెళ్ళి రోజునాడు వెల్లువౌ సరదాలు
యశము కలిగి మీరు మసలగలరు!