Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
జంటగులాబీలు జడలోన తురమాలి
కంటితో కాంచాలి జంటమాది
మధురాతి మధురము మాస్నేహ బంధము
కనిపించగలవులే కావ్య సుధలు
హృదయాన నీవున్న వ్యధలన్ని పోవును
మదన పెట్టకునీవు కదలిపోయి
నిదురలో కూడాను నీతలుపులు నిండె
తలుపులు తెరిచాను తలచి నిన్ను!
ఆ.వె
చందమామ జార అందుకున్నా నేను
సుందరాంగి నీవు చంద్రవదన
మంద గమన నీవు మందాకినివినీవు
పూల కొమ్మ లాగ మేలు కొమ్మ!
బి. శశికళ