Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరికి వారే..!!
తమ లోపలికిపోయి
తేల్చుకోలేని
కథలు ఎన్నెన్నో??
తేలని లెక్కలెన్నో..??
లెక్కబెట్టుకోవాలి..!!
పుట్టుకతో.. వచ్చినవి..
అనుసరించి.. వచ్చినవి..
అనుకరణతో.. వచ్చినవి..
నిలువెల్ల ఇమిడిపోయినవి
గమ్యం తెలియని స్థితిలో..
గంతులేస్తున్నాయి..!!
ఎత్తు పల్లాలను
మిట్ట ప్రాంతాలను
తడిమి చూసుకుంటే..!!
తేల్చు కోలేనివి
తేట తెల్ల మవుతాయి..
ముడి పడ్డ చిట్టను
ముడి విప్పి చూస్తే..!!
తప్పుల లెక్కలెన్ని ..??
స్వార్థపు కుప్పలేన్ని..!!??
లోపల దాగివున్న చీకటి కోణంలో
మనసు చుట్టు
పెన వేసుకొని ఉన్నవి తెలువాలి..
ఆశల ఆసరా అడుగులెన్ని..??
కళ్ళలో ఒత్తులు వెలిగించి
మనసు చెప్పే ఆజ్ఞకొరకు
నిరీక్షిస్తూనే ఉంటాం..!!
కదిలే ఊహ ఏ దారివైపు
నడిపిస్తుందో..!!
ఈ నడక ఏవైపుసాగునో...
ఏ నటనతో ఎందర్ని
కొల్లగొట్టతారో..!!
మస్తిష్కంలో పేనుకొని..
మనసులో పురుడు పోసుకొని
దాహం తీరాని గొంతయ్యింది..!!
అనాది నుండి
వచ్చిన ఆచారంగా
పునాది రాయిగా వేసుకొని..
కాంతి వేగంతో లొలొపల
కదులుతాడు..!!
తలమీద తెలియని స్పర్శ..
వీపు మీద తడిమినట్లు..
మనసాక్షి గుర్తుచేస్తుంది..!!
నమ్మిన వారిని
నట్టేట్లో ముంచకు..!!
నిన్ను ఆశ్రయించిన వారిని ..
నాశనం చేయకు..
బతుకులను శూన్యం చేయకు..
నీ మనుగడ
మాయ మవుతుంది..!!
అలుపెరుగని
బాటసారి లోపల ఉన్నాడు..
రాత్రి అంతా వేతుకుతాడు..!!
పగలంతా పరితపిస్తాడు..!!
అందుకే ఎవరి తప్పులు వారు
తెలుసుకొని మసులు కోవాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
23-9-2020