Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా ఊహ సుందరి
ఎక్కడెక్కడో నీకై వేదికాను...
నీలో ఓదిగిపోవాలని..!!
నీ కళ్లలోని కాంతిని
నింపుకోవాలని..!!
అందమైన ఆకృతిని
ఒంపుకోవాలని
శూన్యం లోకి
నామనసును విసిరేశాను...
ప్రకృతి నిండా
పరుచుకున్నావాని..!!
కొన సాగిస్తున్న
అన్వేషణలో
నీ రూపం మెరిచే చుక్కలుగా
మురిసె ముంగురులుగా కనిపించాయి..!!
కళ్ళు నలుపుకుంటూ ..
ఆశ్చశర్యంగా చూశాను..!!
పయనించే తారాల
నామనసులో
నర్తించే సుందరివి
నాఊహాలకు
ఊపిరి పోస్తున్నావు..!!
నా భావాలకు
ఊతమై నిలబడుతున్నావు
నీతోనే తెల్లవారేది
పెంచిపోషించుకుంటాం..!!
కొలిచి మనసు నింపుకుంటున్నాం
అమెరికలోనైన అంతరిక్షలో నైన
నీవు మాతోటె ఉంటావు..!!
బాధలు పోవాలంటే
నీ ఊహలో తిరగాలి..!!
దుఃఖపు స్మృతిలోనో
మానసికంగా కుంగినప్పుడో..!!
మనోవేదన నిండినప్పుడు..
నిన్నే తలుచుకుంటాం..!!
అంతసంఘర్షణలో..
కొట్టు మిట్టాడినప్పుడు..
అలుముకొని సంతృప్తి నిస్తావు..!!
మాలో అసంతృప్తి పోవాలంటే
సంతృప్తిగా మాలో నిలువాలి..!!
నీ గుండే తలుపుల్ని
నిత్యం తట్టి లేపుతుంటా..!!
కమ్మని నీ ప్రేమ స్పర్శకు
పర్వశించిపోతా...!!
కవి నిత్యం సంచరించేది
నీ అందమైన లోకంలోనే
అమ్మలోని కమ్మదనంల
నీలో సమస్థాని తడిమి
చూసుకుంటా..
నీ లోకం బహు పసందైన లోకం..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801