Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
చరవాణి 7780153709
'నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు' అని ఎలుగెత్తి చాటిన
అభ్యుదయ కవి..
సమాజంలోని
అసమానతలను
కలంతో సంధించి..ప్రశ్నించిన దళిత కవి..
పేదరికం, కులమత బేధాలే
నా గురువులని చాటి చెప్పిన
తెలుగు కవనా చక్రవర్తి..
నిమ్నజాతి కడగండ్లను కవిత్వంతో దునుమాడిన ప్రజాకవి..మనసులో నిర్మలత్వం నశిస్తే..
నిరంకుశత్వానికి, అరాచకానికి దారితీస్తుందని..
సమాజానికి హానిచేస్తుందని.. విశ్వజనీన చింతనే దీనికి పరిష్కారమని తెలియజెప్పిన.. చింతనగల తెలుగుకవి.
బడుగు జీవుల వ్యథలను
కరడు కట్టిన హృదయాలను
పద్య కవితలతో కదిపి కుదిపిన జన జాగృత కిరణం..
గబ్బిలం, ఫిరదౌశి, ముంతాజ్ మహల్, కందిశీకుడు, బాపూజీ వంటి..ఎన్నో అద్భుత ఖండ కావ్యాలను జాలువార్చిన మేథ..
పేదరికం అద్దిన సహనంతో అలసిన అక్షర ఉరవడికి
కొత్త శక్తినిచ్చిన కళాప్రపూర్ణుడు పద్మభూషణుడు గుర్రం జాషువా.!!