Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకు నీవే.. గొప్పగా
చెప్పుకోకు..
గప్పాలతో డప్పులు కొట్టుకోకు
అసహ్యం పుట్టిస్తోంది..!!
ఈ అలవాటు
తప్పని తెలుసుకో..!!
నీలోఉన్నది యేదో చూపు..!!
భవితను దిద్దే మార్గముందా..??
మంచిని నేర్పే మౌనముందా..??
జాతిని జాగృతపరుస్తున్నవా..!!
సామాజిక ..
అంశాలతో నడుస్తున్నవా..??
ఆత్మీయత ..
అందరికి పంచుతున్నావ..??
ఏ విదంగా ..
గోప్పగాచెప్పుకుంటున్నావు..!!
గొప్పోడిగా భావిస్తున్నావు..!!
నిస్వార్థంగా సేవచేస్తున్నవా..??
నిర్భాగ్యులకు..
నీడను ఇస్తున్నావా
అనాధలకు..
ఆసరవుతున్నావా..??
కాలం గమనంలో గతితపి
తిరుగుచున్నవారికి..
సహయం చేచూస్తున్నావా..?
నీలో దాగివున్న..
పైత్యాన్ని తొలిగించు..!!
ప్రపంచంలోని
నిజాలు కనబడతాయి..!!
ఏదో.. నింపుకున్న
నిషాలో ఉన్నావు..
నిజమైన ..
ఉషోదయంలోకిరా...
నీకు నీవే తెలుసుకోలేని
పొరపాట్లు చేస్తున్నావు..!!
తప్పటడుగులు వేస్తున్నావు..!!
అన్నీ.. మరిచిపోయి
ఏదేదో.. వాగేస్తున్నావు..!!
నిన్నునీవు సమర్తించుకుంటావు..
స్నేహ చెలిమి లేదు..
చైతన్య నడక లేదు..
ఎగురుతున్న నీ మాటలు
సర్రునా చూపులను తెంపేస్తోంది..!!
నిజాలను నరిక్కేస్తుంది..!!
మత్తు నుంచి నీ విలాసాల
గమ్మత్తు నుంచి బయటికిరా..!!
నిలదీసి నిప్పులు కక్కిస్తారు..!!
కుప్పకూలి పోతావు..!!
వ్యర్థవాగుడు ఆపి..
వర్తమానంలోకి రా..!!
నిబద్ధత అంటావు...
అబద్దమాడుతావు
నీకు నీవే గుట్టు బయట
పెట్టుకుంటున్నావు...
రట్టుచేసి రచ్చకీడుస్తారు..!!
నీవో.. పెద్ద బద్దకాస్తుడివి
ఎందరెందరో ఉన్నారు..
అందరికి ఇదే హెచ్చరిక..!!
అంబటి నారాయణ
నిర్మల్
984932801