Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహితీ వనంలో మనకోసం వెలుగునిచ్చేందు
ఉదయించిన మరో బాస్కరుడి పేరే కవి శేఖరుడు గుర్రం జాషువా
అలనాటి చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిన
నవయుగ చక్రవర్తిగా పేరొందిన అతను గొప్ప కవిగా మనందరికి సుపరిచితుడు
అందమైన అక్షరాలను అలవోకగా అల్లడంలో అందెవేసిన అతను
తన స్వహస్తాలతో మరుపు రాని
ఎన్నో అద్భుతమైన కావ్య ఖండికలను రాసి మనకు కానుకగా అందించాడు
జననం అతి సామాన్యమైన
అతని జీవితం అసాధారణ వ్యక్తిత్వంతో ముందుకు కొనసాగుతూ
ఎందరికో ఆదర్శమైంది
విద్యా బుద్ధులు నేర్పే గురువు స్థాయి నుండి మొదలైన
అతని పయనం చివరకు శాఖోపశాఖలుగా
విస్తరించి నీడనిచ్చే వటవృక్షమై నిలిచింది
ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన అతను
మనపై చల్లని వెన్నెలను కురిపించేందుకు చందమామలా
మారిన అతని చరితం అమరం... అజరామరం!!
జవేరియా
9849931255