Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీహరికోటి, ఏలూరు
9441756213
1. సీ.
రక్త స్వేదము చింది రాత్రింబవళ్ళును
కాయ కష్టము బంట గాచు వాడు
తెగులు పంటకు సోక దిగులుతో మందుల
జిమ్మి చీడల మాపు జేయు వాడు
పంట చేలం దుండి బండ రాయిగ మారి
దండిగా పనిచేయు మొండి వాడు
తిండి గింజల కని కండల గరగించి
బండ చాకిరి జచ్చి బ్రతుకు వాడు
ఆ.వె.
ఎండ వాన చలికి యెదురీదు మొనగాడు
పైరు బాగు జూచు పాటుగాడు
పంట చేతి కంద బరవశించెడు వాడు
అన్న దాత రైతు యనెడు వాడు.
2. ఆ.వె.
పంట పొలము బనుల వెంట తిరుగుచుండ
నన్న పాన మన్న ధ్యాస లేక
పట్టె డన్న మైన బట్టి తినక తాను
దాచు పరుల కన్న దానము కన
3. ఆ.వె.
ఎన్ని బాధ లున్న నెన్ని పనుల నైన
పంటి బిగువు నోర్పు బట్టు వాడు
కరువు లోన బ్రతుకు తెరువు గోల్పోవ న
న్నార్తు లెల్లర కిత డన్నదాత.
4. ఆ.వె.
పుట్టె డైన దాచు పురిలోన ధాన్యము
బిచ్చ మెత్తు వారి కిచ్చుట కని
అట్టి అన్న దాత అసలైన సిసలైన
రాజులకును రాజు రైతు రాజు.