Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో దురాచారాన్ని రచనల ద్వారా
చీల్చి చండాడిన గొప్ప సాంఘిక సంస్కర్త
అభ్యుదయ కవితా పితామహుడు
కన్యను సొమ్మిచ్చి కొనే దురాచారాన్ని
కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రశ్నించాడు
పసిపిల్లలను వృద్ధులకంటగట్టే వెనుకబాటుతనాన్ని
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయంలో నినదించాడు
దేశమును ప్రేమించుమన్నా అంటూ
దేశభక్తిని ప్రజల గుండెల్లో నాటాడు
సారంగధరను ఆంగ్లంలో వ్రాసి పేరొందినా
తెలుగు వ్యావహారికం మీద మమకారంతో
వాడుకభాషలో నాటక, గేయ రచనల ద్వారా
సామాజిక చైతన్యానికి ప్రయత్నించిన హేతువాది
గిడుగు గారితో కలిసి భాషోద్యమంలో పాల్గొన్నాడు
ముత్యాలసరాలు, కన్యక వంటి రచనలతో
నేటికీ పాఠకుల గుండెలను తట్టిలేపే కవిశేఖరుడు
గురజాడ అడుగుజాడలలో నడుద్దాం
అమ్మభాషను కాపాడుకుందాం
సాంఘిక దురాచారాలకు ఎదురొడ్డి పోరాడుదాం
- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
9052048706